Ap News: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు నోడల్‌ అధికారి నియామకం

ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ జరగనుంది. పీఆర్‌సీ నివేదిక, అమలు, ఫిట్‌మెంట్‌, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, వాటి పరిష్కారంపై భేటీలో

Updated : 11 Nov 2021 17:28 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ జరగనుంది. పీఆర్‌సీ నివేదిక, అమలు, ఫిట్‌మెంట్‌, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, వాటి పరిష్కారంపై భేటీలో చర్చించనున్నారు. పీఆర్‌సీ అమలు విషయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో మరోసారి భేటీ కావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞప్తులను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారిని నియమించింది. ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు నోడల్‌ అధికారిని నియమించింది. ఈ మేరకు నోడల్‌ అధికారిగా ఆదినారాయణను నియమిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పీఆర్‌సీ నివేదిక కోసం సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాల నేతలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు నేతలు.. ఐదున్నర గంటలపాటు పట్టువీడలేదు. బుధవారం మధ్యాహ్నం 4గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను కలిశారు. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నానని, వేచి ఉండాలని సీఎస్‌ చెప్పారంటూ.. నేతలు రెండో బ్లాకు ముందు ఎదురుచూశారు. చీకటి పడినా స్పందన రాకపోవడంతో.. నివేదిక ఇచ్చేవరకూ కదలబోమని భీష్మించారు. సచివాలయ భద్రతా సిబ్బంది ఒత్తిడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని