Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక సోమవారం, నాగుల చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల వద్ద సందడి నెలకొంది. నాగు చవితి పర్వదినంతో పాటు కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో పెద్ద

Updated : 08 Nov 2021 11:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల వద్ద సందడి నెలకొంది. నాగు చవితి పర్వదినంతో పాటు కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పరమేశ్వరుడి దర్శనానికి పోటెత్తారు. శ్రీశైలం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు ఈరోజు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొన్ని చోట్ల నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు రాకతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో  మార్మోగుతున్నాయి. నాగుల చవితిని పురస్కరించుకుని భక్తులు పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని