KCR Review: భారీ వర్షాలపై దిల్లీ నుంచి సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

Updated : 07 Sep 2021 14:08 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. జిల్లాల్లో వర్షపాత వివరాలు, లోతట్టు ప్రాంతాల్లో మునకలు సహా వివిధ అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ప్రభావిత జిల్లాల్లో అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించాలని సూచించారు.

రానున్న రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వరద ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల రాజన్న సిరిసిల్లతో మరికొన్ని జిల్లాలను వరద ముంచెత్తింది. ముంపు ప్రాంతాల ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని