Kishan Reddy: దేశంలో డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తాం

దేశవ్యాప్తంగా డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Sep 2022 17:00 IST

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో పర్యటించిన ఆయన.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. అక్కడ కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆధార్‌ కార్డు లేని వారికి పాస్‌పోర్టు ద్వారా టీకా పంపిణీ చేస్తాం. దేశంలో ఆక్సిజన్‌ కొరత రాకుండా పీఎం కేర్స్‌ కింద 1200కుపైగా ఆక్సిజన్‌ ప్లాంట్‌లను నెలకొల్పాం. గాంధీలో 8 ఆక్సిజన్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా మరో ఆరింటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని కిషన్‌రెడ్డి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని