Rayalaseema lift irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని ఎన్జీటీని బోర్డు కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వచ్చే బృందంలో తెలంగాణకు చెందిన వారు ఎవరూ ఉండకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు సూచించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల వారు లేకుండా చూడాలని ఎన్జీటీ సైతం కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన బృందంలో తెలంగాణకు చెందిన దేవేందర్ రావు ఉండటంపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవేందర్ స్థానంలో మరో వ్యక్తిని నామినేట్ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తామని బోర్డు స్పష్టం చేసింది. అనంతరం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్