
KTR: హైదరాబాద్‌లో నాలాలకు శాశ్వత పరిష్కారం: కేటీఆర్
హైదరాబాద్: నగరంలో నాలాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.859కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. హుస్సేన్‌సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణానికి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ పోగ్రాంలో భాగంగా ఫీవర్ ఆస్పత్రి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హుస్సేన్‌సాగర్ వరదనీటి నాలా రక్షణగోడ నిర్మాణానికి రూ.68.4 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లోని చాలా కాలనీలు జలమయం అవ్వగా.. రక్షణ గోడ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా రక్షణగోడ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి చేయాలి. నాలాలపై ఉంటున్న వారికి నష్టం లేకుండా పనులు చేస్తాం. గతేడాది వర్షాలకు హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలా పొంగింది. వరదలతో ప్రజలంగా ఇబ్బందులు పడ్డారు. 12కి.మీ నాలాకు రక్షణగోడ నిర్మించాలని కోరారు. నాలాల అభివృద్ధితో పాటు వాటి విస్తరణ పనులు చేస్తాం. జీహెచ్‌ఎంసీతో పాటు శివారు మున్సిపాలిటీల్లోనూ నాలాల అభివృద్ధి చేస్తాం’’అని కేటీఆర్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.