KTR: వైద్య విద్యార్థినికి కేటీఆర్ సాయం.. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ

ఫీజు చెల్లించలేక వైద్య విద్యను మధ్యలోనే మానేసే పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఎంబీబీఎస్ చదివేందుకు

Published : 07 Oct 2021 01:13 IST

హైదరాబాద్‌: ఫీజు చెల్లించలేక వైద్య విద్యను మధ్యలోనే మానేసే పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఎంబీబీఎస్ చదివేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్ బోరబండకు చెందిన తిరుపతి అనూష కిర్గిస్థాన్‌ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా.. తల్లి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మెడిసిన్‌లో మొదటి మూడేళ్లు 95శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అనూష.. కరోనా పరిస్థితుల కారణంగా హైదరాబాద్ వచ్చారు. తిరిగి వెళ్లేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో కూరగాయలు అమ్ముతూ తల్లికి సాయం చేస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్.. అనూషకు ఆర్థిక సాయం చేసి ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనూష కుటుంబసభ్యులు కేటీఆర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని