TS News: హైదరాబాద్‌ సిగలో మరో ఫ్లైఓవర్‌.. ప్రారంభించిన కేటీఆర్‌

నగరం సిగలో మరో ఫ్లైఓవర్‌ చేరింది. కంచన్‌బాగ్‌ ఫిసల్‌బండ డీఆర్‌డీఎల్‌ వైపు నుంచి ఒవైసీ ఆసుపత్రి కూడలి మీదుగా

Updated : 28 Dec 2021 13:24 IST

హైదరాబాద్‌: నగరం సిగలో మరో ఫ్లైఓవర్‌ చేరింది. కంచన్‌బాగ్‌లోని ఫిసల్‌బండ డీఆర్‌డీఎల్‌ వైపు నుంచి ఒవైసీ ఆసుపత్రి కూడలి మీదుగా బైరామల్‌గూడ వైపు వెళ్లేందుకు ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒవైసీ- మిధాని కూడళ్లలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల మేర ఈ పైఓవర్‌ను నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా పైవంతెన నిలవనుంది. ముఖ్యంగా పాతబస్తీ నుంచి ఎల్బీనగర్‌ వైపు ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నాయి.

మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్‌ రింగ్‌రోడ్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ పైవంతెన ద్వారా చాంద్రాయణగుట్ట, కర్మాన్‌ఘాట్‌ మార్గాల ద్వారా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని