TS News: వాగు, వంకలు దాటెళ్లి వైద్యసేవలు

ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కొందరిలో జవాబుదారీతనం కనిపించదు. ఏ చిన్న కారణం దొరికినా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవారు చాలా మందే ..

Updated : 21 Jul 2021 14:11 IST

ఆళ్లపల్లి: ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కొందరిలో జవాబుదారీతనం కనిపించదు. ఏ చిన్న కారణం దొరికినా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవారు చాలా మందే ఉంటారు. అలాంటిది ఓ వైపు వర్షం మరోవైపు పొంగుతున్న వాగు, రోడ్డు లేదు.. వాహనం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెడలో స్టెతస్కోప్‌తో వాగు దాటి కొండకోనల్లో నుంచి ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్నారు ఓ వైద్యురాలు. వాగులు, వంకలు లెక్క చేయకుండా గిరిజనుల కోసం కదిలొచ్చిన డాక్టర్‌ సంధ్యారాణి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కరోనా విపత్తు వేళ ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలు అందించిన సంధ్యారాణి గిరిజన తండాల్లో వైరస్‌ కట్టడికి కీలక పాత్ర పోషించారు. ఇటీవల వర్షాల కారణంగా కిన్నెరసాని వాగు ఉప్పోంగుతోంది. ఈ వాగును దాటుకుంటూ మందులను తీసుకొని ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి సేవలు అందిస్తున్న సంధ్యారాణి వైద్యో నారాయణో హరీ అన్న నానుడిని సార్థకం చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని