Amaravati Padayatra: అమరావతి రైతుల పాదయాత్రలో లాఠీఛార్జ్‌.. విరిగిన రైతు చేయి

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 11 Nov 2021 16:16 IST

నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని