Ts News: రెండు రోజులు వెబ్‌సైట్‌ పనిచేయదు.. నేటి రాత్రిలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి వెల్లడించారు. నిర్వహణ పనుల నిమిత్తం 21, 22న వెబ్‌సైట్‌ పనిచేయదని స్పష్టం చేశారు. నేటి రాత్రి 7 గంటల్లోగా అభ్యర్థులు లాసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 23, 24న లాసెట్‌,

Updated : 20 Aug 2021 01:18 IST

హైదరాబాద్‌: ఈ నెల 21, 22న లాసెట్‌ వెబ్‌సైట్‌ పని చేయదని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి వెల్లడించారు. నిర్వహణ పనుల నిమిత్తం 21, 22న వెబ్‌సైట్‌ పనిచేయదని స్పష్టం చేశారు. నేటి రాత్రి 7 గంటల్లోగా అభ్యర్థులు లాసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 23, 24న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

21న ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష..

ఈ నెల 21వ తేదీన ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు మోడల్‌ స్కూల్స్‌ పీడీ ఉషారాణి తెలిపారు. వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్ష సమయంలో అభ్యర్థులు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని