వరదలో చిక్కుకున్న ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే కారు

నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

Updated : 15 Jul 2021 15:28 IST

హైదరాబాద్‌: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా హస్తినాపురం సాగర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి వాహనం వరదలో చిక్కుకుంది. భద్రతా సిబ్బంది, స్థానికుల సాయంతో సుధీర్‌రెడ్డి కారును ముందుకు నెట్టారు. అనంతరం కారు నీటి నుంచి బయటకు వచ్చింది. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని