AP News: విశాఖ మన్యంలో మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు.. లంబసింగిలో ఎంతంటే..

విశాఖపట్నం జిల్లాల్లోని మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించాయి. పాడేరు, చింతపల్లి, లంబసింగి

Updated : 24 Dec 2021 11:54 IST

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాల్లోని మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించాయి. పాడేరు, చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. ఇటీవల వరకు సుమారు 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఈరోజు మరింత తక్కువకు పడిపోయింది. లంబసింగిలో 3.8 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గిరిజనులు వణికిపోతున్నారు. 

మన్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే తరహా వాతావరణం ఉంది. గత మూడురోజులుగా చలి తీవ్రత అధికమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. మంచు తీవ్రతతో వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని