AP News: అమరావతి పాదయాత్రకు మహారాష్ట్ర రైతుల సంఘీభావం

ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 41వ రోజుకు చేరింది.

Updated : 11 Dec 2021 16:46 IST

శ్రీకాళహస్తి: ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 41వ రోజుకు చేరింది. ఈరోజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ దాదాపు 17 కి.మీ మేర యాత్ర జరగనుంది. పాదయాత్ర మధ్యలో మహిళా రైతులకు స్థానిక మహిళలు పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చారు.

మరోవైపు ఈ యాత్రకు మహారాష్ట్ర రైతులు సంఘీభావం ప్రకటించారు. తెలిపారు. పుణె, పింప్రి, చించువాడ్‌, బోసారి ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు.. అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. సాటి రైతుల ఇబ్బందులను చూసి ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు.ఈనెల 17న తిరుపతిలో తాము నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారని అమరావతి రైతులు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని