TS News: ఈటల భూముల అంశం.. కబ్జా వాస్తవమే: మెదక్‌ కలెక్టర్‌

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ అసైన్డ్‌ భూములను కబ్జా చేసింది వాస్తవమే

Updated : 06 Dec 2021 16:23 IST

మెదక్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ అసైన్డ్‌ భూములను కబ్జా చేసింది వాస్తవమే అని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడించారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని చెప్పారు. ఈటల భూముల అంశంపై కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

‘‘56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలింది. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్‌ భూముల కబ్జా జరిగింది. జమునా హేచరీస్‌ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేశారు. పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించాం. అసైన్డ్‌ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై నివేదిక పంపాం. అక్రమాలకు పాల్పడిన వారిపై, సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధిత అసైనీలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’’ అని కలెక్టర్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని