Medicine From Sky : దేశంలో తొలిసారి డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీ

దేశంలో తొలిసారి డ్రోన్‌ల సాయంతో ఔషధాల పంపిణీకి వికారాబాద్‌ వేదికైంది. ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ పేరుతో వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ

Updated : 11 Sep 2021 15:34 IST

వికారాబాద్‌లో ప్రారంభించిన సింధియా, కేటీఆర్‌

వికారాబాద్‌ : దేశంలో తొలిసారి డ్రోన్‌ల సాయంతో ఔషధాల పంపిణీకి వికారాబాద్‌ వేదికైంది. ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ పేరుతో వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు దీని ద్వారా మందులు సరఫరా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

డ్రోన్‌లో ఔషధాల బాక్సులను పెట్టి జ్యోతిరాదిత్య సిందియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేశాయి. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

‘సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తారు. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమని ఆయన చెబుతుంటారు. రాష్ట్రంలో ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నాం. అధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేస్తాం. ఆరోగ్య రంగంలోనే కాదు.. అనేక రంగాల్లో డ్రోన్లు వాడొచ్చు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లు వాడుతున్నాం. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే భయపడతారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా కట్టడి చేయొచ్చు’ అని కేటీఆర్‌ వివరించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని