Vaccination Drive: ఖాజాగూడలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

నగరంలోని ఖాజాగూడా జీహెచ్ఎంసీ స్పోర్ట్స్‌ కాంపెక్ల్స్‌లో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది.

Updated : 12 Oct 2021 11:38 IST

హైదరాబాద్‌: నగరంలోని ఖాజాగూడా జీహెచ్ఎంసీ స్పోర్ట్స్‌ కాంపెక్ల్స్‌లో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రతి రోజు ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. వ్యాక్సినేషన్‌పై స్థానిక కాలనీల్లో ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యాక్సిన్‌ కోసం ఎక్కువ సేపు నిరీక్షించకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఖాజాగూడలోని వలస కూలీలపై దృష్టి పెట్టాలని సీఎస్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.8కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించారు. నెలలోగా వందశాతం తొలి డోసు పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్‌ తక్కువైన చోట కలెక్టర్‌తో మాట్లాడుతున్నామని సీఎస్‌ తెలిపారు.

నిమ్స్‌ని ప్రపంచస్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. దసరా తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు వసతితో పాటు ఆహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్‌ వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని