AP News: ఇష్టానుసారం టికెట్‌ రేట్లు పెంచుతామంటే ఒప్పుకోం: బొత్స

సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యం తప్ప.. చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయడం..

Updated : 23 Dec 2021 14:14 IST

విజయనగరం: సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యం తప్ప.. చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయడం కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తే థియేటర్‌ యజమానులు అధికారులను కలిసి విన్నవించుకుంటే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతేతప్ప ఇష్టానుసారం టికెట్‌ ధరలు పెంచి విక్రయిస్తే ప్రభుత్వం ఒప్పుకోదన్నారు. దేనికైనా ఎమ్మార్పీ ధర ఉంటుందని.. సినిమా టికెట్‌కు మాత్రం ఉండకూడదంటే ఎలా అని బొత్స ప్రశ్నించారు.

సినిమా టికెట్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తామంటే కుదరదని బొత్స చెప్పారు. సినిమా అనేది సామాన్యుడికి వినోద సాధనమని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు ధరలు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సినిమా చేసే వారికి మేలు చేసేందుకే ప్రభుత్వం సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో పలు సినిమా థియేటర్ల సీజ్‌పైనా బొత్స స్పందించారు. సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని