
Harish Rao: ఎయిడ్స్ రోగుల పట్ల చిన్నచూపు తగదు: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: గాలి, తాకడం ద్వారా ఎయిడ్స్ సోకదని..ఆ రోగుల పట్ల చిన్నచూపు తగదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎయిడ్స్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తు్న్నామని.. ఆ వ్యాధి సోకకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతి నెలా రూ.2016 పింఛను ఇస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని.. 70వేల మందికి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేకంగా వరంగల్, హైదరాబాద్‌లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రి పేదలకు అందుబాటులోకి రానుందని చెప్పారు. నర్సింగ్ వృత్తిలో ఉన్న విద్యార్థులకు ప్రతినెలా స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.