TS News: రూ.10వేల కోట్లతో ఆరోగ్యశాఖ బలోపేతం: హరీశ్‌రావు

తెలంగాణలో రాబోయే రోజుల్లో రూ.10వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ

Updated : 24 Sep 2022 17:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే రోజుల్లో రూ.10వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌ నిలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డును ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రూ.33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యానికి దీటుగా సేవలను అందించాలని వైద్యులను కోరారు. హైదరాబాద్‌కు నలువైపులా నాలుగు మెడికల్‌ టవర్లను తీసుకురావాలని కృషి చేస్తున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమం నిలోఫర్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉందని చెప్పారు.

‘‘తెలంగాణలో కరోనా రెండో దశ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయి. వ్యాక్సినేషన్‌లో దేశ సగటు కంటే తెలంగాణ ముందుంది. కరోనా మూడో దశ సన్నద్ధతకు రూ.133కోట్లు కేటాయించాం. చిన్నపిల్లల కోసం 5వేల పడకలను సిద్ధం చేశాం.  కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం నుంచి 50శాతం పెరిగాయి. తల్లి, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. మరో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి’’ అని హరీశ్‌రావు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు