Ts News: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొదటిసారిగా అందుబాటులోకి బోన్ డెన్సిటోమీటర్: హరీశ్‌రావు

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిలో రూ. 154 కోట్లతో నూతనంగా వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్స్‌ని సమకూర్చనున్నట్టు

Published : 07 Dec 2021 15:16 IST

హైదరాబాద్‌: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిలో రూ. 154 కోట్లతో నూతనంగా వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్స్‌ని సమకూర్చనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. నిమ్స్ ఆస్పత్రిలో తాజాగా ఏర్పాటు చేసిన జన్యుపరమైన వ్యాధులను గుర్తించే ల్యాబ్ సహా బోన్ డెన్సిటోమీటర్, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్, న్యూమాటిక్ ట్యూబ్ సిస్టంలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొట్టమొదటి సారిగా బోన్‌ డెన్సిటోమీటర్  అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 89 వెంటిలేటర్ బెడ్స్‌కి అదనంగా త్వరలో మరో 120 వెంటిలేటర్ బెడ్స్‌, మరో 200 ఐసీయూ పడకలను వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. వీటికి తోడు గర్భిణీల కోసం నిమ్స్‌కి అనుబంధంగా 200 పడకలతో ఎంసీహెచ్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని