Ts News: దుబ్బాకకు బస్తీ దవాఖానా తీసుకొస్తాం: హరీశ్‌రావు

తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఐసీయూ కేంద్రాలు వచ్చాయని రాష్ట్ర వైద్యోరాగ్య శాఖ మంత్రి తన్నీను హరీశ్‌రావు అన్నారు. 30 పడకల నుంచి వంద పడకలకు  పెంచినతెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఐసీయూ కేంద్రాలు వచ్చాయని రాష్ట్ర వైద్యోరాగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 30 పడకల నుంచి వంద పడకలకు  పెంచిన

Updated : 25 Dec 2021 16:01 IST

దుబ్బాక‌: తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఐసీయూ కేంద్రాలు వచ్చాయని రాష్ట్ర వైద్యోరాగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 30 పడకల నుంచి వంద పడకలకు  పెంచిన దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఉమ్మడి మెదక్‌లో ఒక్క ఐసీయూ కేంద్రం కూడా లేదన్నారు. ఈ వంద పడకల ఆస్పత్రితో పాటు ఐసీయూ పడకలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కిట్‌ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 52 శాతానికి పెరిగాయని వెల్లడించారు. దుబ్బాకలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా.. త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు.

‘‘దుబ్బాకలో పెద్ద ఎత్తున వంద పడకల ఆస్పత్రిని తీసుకొచ్చాం. మరి ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ) (special newborn care units) కూడా కావాలి. ఇందుకోసం ఇంక్యుబేటర్స్‌ అందుబాటులోకి తీసుకురావాలి. రెగ్యులర్‌గా విధులు నిర్వర్తించే నర్సులు చిన్న పిల్లలకు సంబంధించిన పనులు చేయలేరు. వారిని రిక్రూట్‌ చేసుకొని.. నీలోఫర్‌లో శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. పిల్లల వైద్యులను నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన అన్ని చర్యలు తీసుకొని త్వరలోనే దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్‌ఎన్‌సీయూని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటివరకు బస్తీ దవాఖానాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రత్యేకంగా సిద్దిపేటలోని కేసీఆర్‌ నగర్‌లో ఏర్పాటు చేశాం. అదే విధంగా దుబ్బాక పట్టణంలో కూడా బస్తీ దవాఖానాను మంజూరు చేస్తాం. భవిష్యత్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని