Ap News: చీడ నివారణ చర్యలపై ఉన్నత స్థాయి కమిటీ: కన్నబాబు

రాష్ట్రంలో మిర్చి పంటకు సోకిన చీడ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

Updated : 23 Dec 2021 15:35 IST

అమరావతి: రాష్ట్రంలో మిర్చి పంటకు సోకిన చీడ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మిర్చి పంటకు వాటిల్లిన నష్టం, నివారణా చర్యలపై ఈ కమిటీ పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు. దీనిపై ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షించారు. తక్షణమే రైతులకు సూచనలు, సలహాలు జారీ చేసేందుకు ఉద్యాన శాఖ అధికారుల క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు.

‘‘2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5.11 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. త్రిప్స్, జెమినీ వైరస్ (నల్లతామర పురుగు) కారణంగా మిర్చిపంట తీవ్రంగా దెబ్బతింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా శాస్త్రీయమైన నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక,  తమిళనాడులో రాష్ట్రాల్లోనూ మిర్చి పంటలపై వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రస్తుతం ఉద్యాన విశ్వవిద్యాలయంతో పాటు ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి రైతులకు సలహాలు ఇవ్వడంతో పాటు నివారణ చర్యలనూ సూచిస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని