Koppula Eshwar: 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం.. రూ.100 కోట్లతో టెండర్లు ఖరారు

నగరంలోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఏడాది నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ

Updated : 09 Sep 2021 17:48 IST

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఏడాది నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్ తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన కొప్పుల.. విగ్రహం, నిర్మాణాలు అంబేడ్కర్ ఖ్యాతిని తెలియజేసేలా ఉంటాయన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ ఆకారంలో విగ్రహం అడుగున 50 అడుగుల మేర భవంతి ఉంటుందన్నారు. దానిపైన 125 అడుగుల విగ్రహం వస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.100 కోట్లతో టెండర్లు ఖరారు చేసినట్లు మంత్రి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని