Updated : 08/11/2021 16:17 IST

KTR: సోనూసూద్‌.. వాటికి భయపడాల్సిన పనిలేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: కొవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా సోనూసూద్‌ మానవత్వంతో సేవాభావం చాటుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని కొనియాడారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనూసూద్‌తో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు.

సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వమొక్కటే అన్నీ చేయలేదని మంత్రి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభమని.. బాధ్యతగా సేవ చేయడం గొప్ప అన్నారు. సోనూసూద్‌ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలతో ఆయన్ను భయకంపితుడిని చేయాలని చూశారని.. అతడి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. వీటన్నింటికీ సోనూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సోనూ రియల్ హీరో అని.. ఆయన వెంట తామంతా ఉన్నామని కేటీఆర్‌ చెప్పారు. మంచి పనులు చేస్తూ ఉండాలని.. సోనూతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

కేటీఆర్‌ లాంటి నేతలుంటే.. నా అవసరం ఉండదు: సోనూసూద్‌

అనంతరం సోనూసూద్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ లాంటి నేతలు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదన్నారు. కొవిడ్‌ వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని.. బాధితులకు సహాయ పడటమే మన ముందున్న సవాలని చెప్పారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. తెలంగాణ నుంచే ప్రతి స్పందించే వ్యవస్థ కనిపించిందని సోనూసూద్ చెప్పారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని