KTR: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఎలాంటి పైరవీలూ అవసరం లేదు: కేటీఆర్‌

నిరుపేదలకు రూ.40లక్షల ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 17 Dec 2021 15:16 IST

హైదరాబాద్‌: నిరుపేదలకు రూ.40లక్షల ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని పెద్దలు అన్నారని.. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరేనని చెప్పారు. నగరంలోని బన్సీలాల్‌పేట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూ.11వేల కోట్లు ఖర్చు చేసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిందన్నారు. నగరంలోని పేదలందరికీ ఇళ్లు వచ్చేలా చూస్తామని.. ఈ విషయలో ఎలాంటి పైరవీలూ ఉండవని స్పష్టం చేశారు. లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని