Ts News: సివిల్స్‌ ర్యాంకర్లను అభినందించిన మంత్రి కేటీఆర్‌

సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్‌గా నిలిచిన శ్రీజను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. శ్రీజ తన కుటుంబసభ్యులతో

Published : 30 Nov 2021 21:24 IST

హైదరాబాద్‌: సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్‌గా నిలిచిన శ్రీజను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. శ్రీజ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సివిల్స్‌లో విజయం సాధించేందుకు దోహదపడిన అంశాలు, స్ఫూర్తినిచ్చిన విషయాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ నర్సుగా తల్లి చేస్తున్న సేవలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని శ్రీజ తెలిపారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా తన తల్లి చూపిన సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో విధులు నిర్వర్తించాలని శ్రీజకు కేటీఆర్ సూచించారు. సమాజంలో అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు సివిల్ సర్వీసెస్ అతి గొప్ప అవకాశమని.. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీజను కోరారు. సివిల్స్‌లో 218 ర్యాంక్‌ సాధించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్ రెడ్డిని కేటీఆర్ ఈ రోజు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని