KTR: రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉంది: కేటీఆర్‌

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉందని.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోందని తెలంగాణ

Updated : 06 Sep 2021 15:57 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉందని.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి టెక్‌ మహీంద్రా సంస్థ అందించిన 7 అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహీంద్రా గ్రూప్‌ ఒక్క రంగానికే పరిమితం కాలేదని.. అనేక రంగాల్లో ముందుకెళ్తోందని చెప్పారు. టెక్‌ మహీంద్రా యూనివర్సిటీని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. కరోనా మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెడుతోందని.. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌, అంబులెన్స్‌లు అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ ప్రతినిధులకు ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు