Updated : 06/08/2021 19:22 IST

AP NEWS: వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం : పేర్ని నాని

అమరావతి: యాంత్రిక తప్పిదం వల్లే పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు.  ఈఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా  విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మాన్యువల్‌ గేట్ల స్థానంలో హైడ్రాలిక్‌ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల ప్రాజెక్టు నిండుతుందని వివరించారు. కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. 

వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ‘‘కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది భాజపా ఆశ. తెదేపా, భాజపా కుమ్మక్కయ్యే పార్టీలు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారు’’ అని పేర్ని నాని విమర్శించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని