Ramappa temple: అద్భుతమైన హెరిటేజ్‌ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం: శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితంగానే రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 30 Jul 2021 15:23 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితంగానే రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించిన నేపథ్యంలో దేవాలయం పరిసర ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై  పురావస్తు శాఖ, సర్వే ఆఫ్‌ ఇండియా, హెరిటేజ్‌ ఆఫ్‌ తెలంగాణ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం, రాష్ట్రం పరిధిలో ఉండే అంశాలపై సమావేశంలో చర్చించారు. 

శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అద్భుతమైన హెరిటేజ్‌ ప్రదేశంగా రామప్ప గుడిని తీర్చిదిద్దుతామన్నారు. ఒక్క రామప్ప గుడిని మాత్రమే కాకుండా వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, కాకతీయుల నాటి దేవాలయాలను గుర్తించి వాటినీ అభివృద్ధి చేస్తామన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు రామప్ప గుడితో పాటు ఇతర దేవాలయాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అధికారులతో కలిసి రామప్ప గుడిని సందర్శించి గుడి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందజేయనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని