
TS News: నెల రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పట్టుకున్న పలువురు ఆబ్కారీశాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సన్మానించారు. నిన్న రూ.2కోట్లు విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను గుర్తించి పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి.. అధికారులను ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. నెల రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రమే అధికారులు లక్ష్యమన్నారు. ఆబ్కారీ అధికారులు నిఘా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంచి పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. సమాచారం అందించిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.