Hyderabad news: హెచ్‌ఎండీఏ పరిధి పెరిగే అవకాశం: మంత్రి తలసాని

మురుగునీటి వ్యవస్థ ప్రణాళికపై తెరాస ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన

Updated : 25 Sep 2021 17:27 IST

హైదరాబాద్‌: మురుగునీటి వ్యవస్థ ప్రణాళికపై తెరాస ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. హైదరాబాద్ జలమండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మీ, జలమండలి ఎండీ దానకిషోర్ లతో కలిసి మంత్రి తలసాని పాల్గొన్నారు. నగరంలోని తాగునీటి, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచేందుకు రూ.5వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా మంత్రులు దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ ఉండటం గ్రేటర్ హైదరాబాద్‌ ప్రజల అదృష్టమన్నారు. ‘‘ఏ నగరంలో అయినా మురుగునీటి వ్యవస్థ చాలా కీలకమైనది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించాం. ఇప్పుడున్న 25 ఎస్టీపీలకు అదనంగా మరో 31 ఎస్టీపీలను రెండేళ్లలో నిర్మిస్తాం. రాబోయే కాలంలో తాగునీటి, మురుగునీటి సమస్యలు తీర్చేలా చర్యలకు సిద్ధమయ్యాం. ప్రతి నియోజకవర్గానికి నాలుగు ఎయిర్‌టెక్‌ మిషినరీని ఏర్పాటు చేశాం. మురుగునీటి శుద్ధికోసం రోబోటిక్‌ పరిజ్ఞానం అవలంబిస్తాం. యుద్ధప్రాతిపదికన ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. హెచ్‌ఎండీఏ పరిధి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి, విస్తరణ జరుగుతోంది. హైదరాబాద్‌ నగర ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయి’’ అని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని