
KTR: వరంగల్‌కు జెన్‌పాక్ట్.. కేటీఆర్ హర్షం
వరంగల్: వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు యూఎస్‌కు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్ నుంచి ఆపరేట్ చేస్తుండగా.. వీటి సరసన జెన్‌పాక్ట్ చేరనుంది.
వచ్చే ఆరు నెలల్లో వరంగల్‌లో ఈ టెక్ సెంటర్ సేవలను ఆరంభించనుంది. దీంతో వరంగల్‌లో కొత్తగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌లో ఐటీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.