
RK Roja: మమ్మల్ని మానసిక వేదనకు గురిచేశారు: ఎమ్మెల్యే రోజా
రేణిగుంట: ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడేలా ఇండిగో సంస్థ నిర్ణయం తీసుకోవడం సరికాదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సాంకేతిక లోపం ఉన్నా బెంగళూరుకు మళ్లించి డోర్లు తీయకుండా తమను మానసికంగా ఆవేదనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెంగళూరు మళ్లించిన విషయం తెలిసిందే. ఆ విమానంలో రోజాతో పాటు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.
బెంగళూరులో విమానం ల్యాండైన అనంతరం ఈ ఘటనపై రోజా వీడియోలు విడుదల చేశారు. ఇండిగో సిబ్బంది, సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘వాతావరణం సరిగాలేకపోవడంతో బెంగళూరులో విమానం ల్యాండ్ చేశామని సిబ్బంది చెప్పారు. అక్కడి ఎయిర్పోర్ట్లో దిగాక సాంకేతిక సమస్య అని తెలిసింది. విమానంలో ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.5వేలు కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్ చేశారు.. ఇది కరెక్ట్ కాదు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.