TS News: తెలంగాణలో కొనసాగుతున్న ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 12 స్థానాలకు ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా..

Updated : 14 Dec 2021 10:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 12 స్థానాలకు ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగు నిర్వహించారు. ఈ క్రమంలో నేడు లెక్కింపు చేపట్టారు. జిల్లాకో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓట్లు లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది.

కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాలకు తొమ్మిది, ఆదిలాబాద్‌లో ఆరు, మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అయిదేసి టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. మొదటి ప్రాధాన్యతా ఓటును ముందుగా లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని