TS News: రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు.. ఎన్నంటే! 

తెలంగాణలో నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌

Updated : 06 Nov 2021 18:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ నెలాఖరుకు ప్రస్తుతమున్న మద్యం పాలసీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి సంబంధించి కమిషనర్‌ అధికారులతో చర్చించారు. గత రెండేళ్ల మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. మరో 350కి పైగా పెరిగే అవకాశం ఉంది. దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంపై సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడలకు 15శాతం రిజర్వేషన్లు కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తో్ంది. లైసెన్సు ఫీజు, దరఖాస్తు రుసుముల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని