NGT: ఏపీలో పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించడం సిగ్గుచేటు: ఎన్జీటీ

ఏపీలో పర్యావరణ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) వ్యాఖ్యానించింది.

Published : 09 Aug 2021 13:53 IST

దిల్లీ: ఏపీలో పర్యావరణ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) వ్యాఖ్యానించింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై జస్టిస్‌ ఆదర్శకుమార్‌ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడేళ్ల నుంచి పోలవరం కాఫర్‌ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను నిలదీసింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కూడా చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీసీబీ నివేదికలో కేసు ముగించాలన్న ఆత్రుత మాత్రమే కనిపించిందని తప్పుబట్టింది.

చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి లోపించిందన్న ఎన్జీటీ ధర్మాసనం.. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాలు చేపడితే ఎలా? అని ఘాటుగా ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ అంచనాను తూతూ మంత్రంగా చేశారని తప్పుబట్టింది. విచారణకు సంబంధించి సాయంత్రం పూర్తి తీర్పు ఇవ్వనున్నట్లు ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని