NGT: అనుమతుల్లేకుండా ‘రాయలసీమ ఎత్తిపోతల’ వద్దు: ఎన్జీటీ

అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది.

Updated : 17 Dec 2021 15:30 IST

దిల్లీ: అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ 4నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో సీఎస్‌పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని