
NHRC: చర్యలు సరిగా లేవు.. ఏపీ, తెలంగాణపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని.. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించాలని గత ఏడాది డిసెంబరులో రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఇప్పటివరకు ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని మరోసారి ఆదేశించింది. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఎన్హెచ్ఆర్సీ ఎదుట హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది. 2019 రికార్డుల ప్రకారం 426 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. తెలంగాణలో ఒకే వారంలో 22 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్‌లో 383 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. ఇరు రాష్ట్రాలు ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.