
NIA: తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల ఎన్ఐఏ సోదాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
దీంతో పాటు విశాఖపట్నం అరిలోవ కాలనీలోని న్యాయవాద దంపతులు శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లలోనూ ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నాగోల్లో రవిశర్మ, అనురాధ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు.. ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించే విషయంలోనూ ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.