
Ap News: రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరో వారం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి టీకాలు ఇవ్వగలిగామని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమర్థ నిర్వహణ ద్వారా 11 లక్షల డోసులను ఆదా చేయగలిగామని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ వందశాతం వ్యాక్సినేషన్ వేసినట్లు చెప్పారు. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి టీకాలు వేశామన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే టీచర్లకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే కోటాను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో పిల్లల ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలన్నారు. పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సబ్‌సెంటర్లలో టెలీమెడిసిన్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండాలన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.