Mallaram Pumphouse: మల్లారం పంపుహౌజ్‌లో నీట మునిగిన తొమ్మిది పంపులు

కొద్ది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మల్లారం పంపుహౌజ్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో తొమ్మిది పంపులు నీట మునిగిపోయాయి.

Updated : 31 Aug 2021 12:43 IST

సిద్ధిపేట: కొద్ది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మల్లారం పంపుహౌజ్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో తొమ్మిది పంపులు నీట మునిగిపోయాయి. ఈ మేరకు నీట మునిగిన పంపులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తగా పంపింగ్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. వరద నీటిని తోడి పునరుద్ధరణ పనులను అధికారులు చేపడుతున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా సిద్దిపేట, మేడ్చల్‌, జనగామ, హైదరాబాద్‌ జిల్లాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌కు ఉస్మాన్‌ సాగర్‌, సింగూరు, గండిపేట నుంచి తాగునీటి అందిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తి చేయడానికి 48 గంటల సమయం పడుతుందని ఆ తర్వాత యథావిధిగా పంపింగ్‌ మొదలవుతుందని జలమండలి ఎండీ దానకిషోర్‌ స్పష్టం చేశారు. నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, పటాన్ చెరు, నిజాంపేట్, బాచుపల్లి తదితర ప్రాంతంల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడగా ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని