SDG India Index 2020-21: ఎస్డీజీ ఇండెక్స్‌లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ పనితీరుపై సచివాలయంలో రెండో రోజు నీతి ఆయోగ్ సమీక్ష నిర్వహించింది. ఏపీ ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్ సలహాదారు సమీక్షకు
అమరావతి: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ పనితీరుపై సచివాలయంలో రెండో రోజు నీతి ఆయోగ్ సమీక్ష నిర్వహించింది. ఏపీ ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్ సలహాదారు సమీక్షకు హాజరయ్యారు. మల్టీ డైమెన్షియల్ ఇండెక్స్ సంస్కరణల ప్రణాళికను రూపొందించుకోవాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సంస్కరణలు చాలా కీలకమని.. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్ 62వ స్థానంలో ఉందని తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని.. త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మానవాభివృద్ధి సూచిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ బృందం ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ 2020-2021 రిపోర్టును సీఎంకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు