Updated : 10 Oct 2021 18:08 IST

TSRTC: ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీల్లేవు: సజ్జనార్‌

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిందన్నారు. ప్రయాణికుల సౌకర్యం, వారి భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలు అందిస్తోందని వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని సజ్జనార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.



Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని