AP News : ఇకపై ఏ ప్రభుత్వ భవనానికీ పార్టీ రంగులు వేయం

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ..

Updated : 06 Oct 2021 14:34 IST

హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసిన ప్రభుత్వం

అమరావతి : చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికీ పార్టీ రంగులు వేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణపత్రం దాఖలు చేశారు. పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గతంలో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్‌ జస్టిస్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని