Gandhi hospital: ఆగస్టు 3నుంచి సాధారణ వైద్య సేవలు పునఃప్రారంభం

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు 3నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు..

Updated : 01 Aug 2021 20:32 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు 3నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. కరోనా రెండో దశ కారణంగా గాంధీ ఆస్పత్రిని కేవలం కొవిడ్‌ సేవలకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. కొవిడ్ కారణంగా నిలిపివేసిన అన్ని రకాల సాధారణ వైద్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని