Ts News: కొడుకులు సరిగా చూసుకోవడం లేదు.. జడ్జిని ఆశ్రయించిన వృద్ధ దంపతులు

కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతులు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తమ పిల్లలు తమను ఆదరించడం లేదని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి

Published : 24 Sep 2021 01:24 IST

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతులు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తమ పిల్లలు తమను ఆదరించడం లేదని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అచ్చాయిపల్లికి చెందిన బెస్త ఆశయ్యకు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అందరూ వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు. కుమారులందరూ పక్కా ఇళ్లలో ఉంటూ వృద్ధ దంపతులను రేకుల షెడ్డులో ఉంచారు. అన్నం పెట్టకపోవడం, తన పేరుపై ఉన్న భూమిని ఇచ్చేయాలంటూ కుమారులు ఇబ్బంది పెడుతున్నారని ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి అనితకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి.. వృద్ధ దంపతుల కుమారులు, కోడళ్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని.. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో కుమారులు, కోడళ్లు వృద్ధ దంపతులకు క్షమాపణలు చెప్పారు. బాగా చూసుకుంటామని హామీ ఇచ్చి వారి ఇంటికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని