Ap News: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన
వర్షం మాట వింటేనే చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులు హడలిపోతున్నారు. తిరుపతి, నెల్లూరులో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ..
అమరావతి: వర్షం మాట వింటేనే చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులు హడలిపోతున్నారు. తిరుపతి, నెల్లూరులో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఈనెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పోంగి ప్రవహిస్తున్నాయి. కలువాయి మండల కేంద్రంలోని చెరువు వద్ద నీటి ప్రవాహం ఎక్కువ కావటంతో సోమశిల దక్షిణ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలువకు గండి కొట్టి నది వైపు నీటిని మళ్లించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు