Updated : 25 Jul 2021 11:37 IST

AP News: ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఇవాళ పాదయాత్ర చేపట్టారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి దువ్వాడ వరకు సాగిన యాత్రలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల కాలనీల్లో పర్యటించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని కార్మికులు హెచ్చరించారు.

పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా ఆగస్టు 1, 2 తేదీల్లో ‘చలో పార్లమెంట్‌’ చేపడుతున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కూర్మన్నపాలెంలో చేపట్టిన నిరవధిక దీక్షలు 164వ రోజుకు చేరాయి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts