
Viral video: వ్యక్తి చేతుల్లోంచి ఫోన్‌ను ఎత్తికెళ్లిన చిలుక.. ఏం చేసిందంటే..?
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి దగ్గర నుంచి సెల్‌ఫోన్‌ను చిలుక ఎత్తికెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫోన్ కెమెరా ఆన్‌లో ఉండడం.. చిలుక ఎగురుతున్నా కూడా అది రికార్డు అవ్వడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుంటుండగా అతడి చేతుల్లోంచి మొబైల్‌ను చిలుక ఎత్తుకెళ్లింది. కంగారుపడిన ఆ వ్యక్తి ఫోన్ కోసం చిలుక వెంట పరుగెత్తాడు. అయితే, అది దొరకపోగా చాలా ఎత్తుకు ఎగిరిపోయింది. ఆ ఫోన్ కెమెరా ఆన్‌లో ఉండడంతో పైకెగిరిన ఆ చిలుక నగరం మొత్తాన్ని వీడియో తీసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ ఫోన్‌ను చిలుక ఎక్కడ పడేసింది? ఆ తర్వాత అది ఎలా దొరికింది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.